Tamil Nadu: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై గవర్నర్‌కు ఆ అధికారం ఉండదు..

Tamil Nadu: యూనివర్శిటీల వీసీ నియమాకంలో రాష్ట్ర గవర్నర్ అధికారాలు తొలగించేలా తమిళనాడు సర్కార్ చర్యలు తీసుకుంది

Update: 2022-04-26 05:43 GMT

Tamil Nadu: యూనివర్శిటీల వీసీ నియమాకంలో రాష్ట్ర గవర్నర్ అధికారాలు తొలగించేలా తమిళనాడు సర్కార్ చర్యలు తీసుకుంది. వర్సిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా..విశ్వ విద్యాలయాల చట్టంలో మార్పులు చేసింది. తమిళనాడు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పొన్ముడి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన స్టాలిన్ 2010లో మాజీ సీజేఐ మదన్‌ మోహన్ పూంచీ కమిషన్ నివేదికను ప్రస్తావించారు.

యూనివర్శిటీల ఛాన్సలర్ పదవి నుంచి గవర్నర్‌ను తొలగించాలని కమిటీ సిఫార్సు చేసిందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలోనూ వీసీలను గవర్నర్‌ నేరుగా నియమించరని చెప్పారు స్టాలిన్. రాష్ట్ర ప్రభుత్వ కమిటీ సిఫార్సు చేసిన ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరిని వీసిగా ఎన్నుకుంటారన్నారు స్టాలిన్. తమిళనాడులో రాష్ట్ర, కేంద్ర, ప్రైవేట్ యూనివర్శిటీలల వైస్ ఛాన్సలర్ల సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ సందస్సును ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్ రవి ప్రారంభించారు. ఇదే సమయంలో గవర్నర్ అధికారాలకు కోత విధిస్తూ బిల్లు తీసుకువచ్చింది స్టాలిన్ సర్కార్.

Tags:    

Similar News