Technicolor Closure : టెక్నికలర్ మూసివేత.. 3వేల మంది ఉద్యోగాలు ఔట్

Update: 2025-03-01 12:45 GMT

ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ ఎక్స్, యానిమేషన్ స్టూడియో అయిన 'టెక్నీకలర్' సంస్థ మూతపడింది. పారిస్ కు చెందిన టెక్నికల్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను మూసివేయడంలో భాగంగా బెంగళూరు, ముంబైలలో తన కార్యకలాపాలను నిలిపివేసింది. భారత్ లో 'టెక్నికలర్’ కంపెనీకి సంబంధించి 3200 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, బెంగళూరులోనే దాదాపు 300 మంది ఉన్నారు. సంస్థ తీసుకున్న ఆకస్మిక చర్య అనేక మంది ఉద్యోగులను దిగ్భ్రాంతికి గురిచేసింది. కంపెనీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని, కార్యకలాపాలు కొనసాగించలేక పోతున్నామని టెక్నికలర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిరెన్ ఘోష్ తెలిపారు. ఆర్థికంగా, కార్యాచరణ పరంగా ముందుకు సాగడం లేదనీ.. తాము ఇకపై ఒక సంస్థగా పనిచేయలేని స్థితికి చేరుకున్నామని ఘోష్ అన్నారు. టెక్నికలర్ అత్యుత్తమ ప్రతిభను ఉపయోగించిన, ఉత్తమ ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్న ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టూడియోకు ఇది జరగడం దురదృష్టకరం అని అన్నారు. టెక్నీకలర్ గ్రూప్ సీఈవో కరోలిన్ పారోట్ నుండి ఊహించని ఈమెయిల్ వచ్చే వరకు ఇండియా యాజమాన్యానికి మూసివేత గురించి తెలియదన్నారు.

Tags:    

Similar News