Wayanad : వాయనాడ్ బాధితులకు అండగా... కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో జరిగిన విపత్తుతో మరణించిన కుటుంబాలకు మంత్రి మండలి పూర్తిస్థాయిలో అండగా నిలవాలని నిర్ణయించింది. ఆర్థికంగా చేయూతనివ్వ డంతోపాటు బాధితులను అన్నివిధాల ఆదుకోవాలని నిర్ణయించింది.
మృతుల కుటుంబాలకు మండలిలో సంతాపం తెలిపిన మంత్రి.. చరిత్రలో ఎప్పుడూ జరగనంత విధంగా వాయనాడ్ లో మట్టిపెల్లలు విరిగిపడి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, వారికి అండగా నిలబడి ఇతోధికంగా సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి మండలి భావించిందని పేర్కొన్నారు.
భారీగా ఆస్తినష్టంతోపాటు ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వంతో సంప్రదించి అవసరమైన అన్ని చర్యలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన చేయాలని నిర్ణయించింది.