జమ్మూకశ్మీర్ పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు మరణించారు. విశాఖకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి చంద్రమౌళితోపాటు కావలి(నెల్లూరు జిల్లా)కి చెందిన మధుసూదన్ కూడా తూటాలకు బలయ్యారు. బెంగళూరులో స్థిరపడిన మధుసూదన్ ఫ్యామిలీతో కలిసి ఇటీవల కశ్మీర్‌కు విహారయాత్రకు వెళ్లారు. హైదరాబాద్ SIB కార్యాలయంలో పనిచేస్తున్న మనీశ్ రంజన్(బిహార్ వాసి) కూడా కాల్పుల్లో చనిపోయారు. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అయిన చంద్రమౌళిని టెర్రరిస్టులు కాల్చి చంపేశారు. సహచర టూరిస్టులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. చంపొద్దని వేడుకున్నా వదల్లేదని, పారిపోతుంటే వెంటాడి కాల్చి చంపారని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు పహల్‌గామ్ బయలుదేరారు.
ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మనీశ్ రంజన్ మృతి చెందారు. ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పహల్గామ్ పర్యటనకు వెళ్లగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. భార్య, పిల్లలను తనకు ఎదురుగా పరిగెత్తమని చెప్పారు. ఇంతలోనే బుల్లెట్లు తగిలి మనీశ్ ప్రాణాలు వదిలాడు. భార్యాపిల్లలు సురక్షితంగా బయటపడ్డారు.