Remal Cyclone : బెంగాల్ లో రెమాల్ బీభత్సం
. గంటకు దాదాపు 135కి.మీ వేగంతో గాలులు, వాన;
రెమాల్ తుపాను ధాటికి పశ్చిమ బెంగాల్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గంటకు దాదాపు 135 కిలోమీటర్ల వేగంతో..భారీ ఈదురు గాలులు వీస్తుండడంతో పలుప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. భారీ వర్షాల ధాటికి పలు చోట్ల వరదలు సంభవించాయి. దక్షిణ 24 పరగణాలు జిల్లాలోనిగోసాబాలో ఇంటి పైకప్పు కూలడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ముందుస్తు జాగ్రత్తగా అధికారులు దాదాపు లక్ష మందిని తీరప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీరప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉడండంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక బృందాలను సిద్ధం చేశారు.
తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లక్ష మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోల్‌కతా ఎయిర్‌పోర్టు అధికారులు ఆదివారం మధ్యాహ్నం నుంచి 21 గంటల పాటు విమాన సర్వీసులను రద్దు చేశారు. కాగా, తుఫాన్ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో 8 లక్షల మందికి పైగా ప్రజలను అక్కడి అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను ప్రభావంతో ఒడిశా, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రెమాల్ తుపాను తీరం దాటిన నేపథ్యంలో సంబంధిత అధికారులతో అమిత్ షా మాట్లాడారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. తుఫాను ప్రభావం చూపే అన్ని ప్రాంతాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్‌ని తగినంతగా మోహరించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించేందుకు విపత్తు ప్రతిస్పందన సంస్థలు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయి. విపత్తుల్లో కనీస ప్రాణనష్టం లక్ష్యంగా మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. గవర్నర్ డా.సి.వి.ఆనంద్ బోస్ మాట్లాడుతూ.. ఈ సంక్షోభాన్ని ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ఎదుర్కొనేందుకు బెంగాల్ సిద్ధంగా ఉంది. బెంగాల్ ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. మేము ఖచ్చితంగా ఈ తుఫానును నమ్మకంగా, సమర్ధవంతంగా, క్రియాశీలంగా ఎదుర్కొంటాము. గవర్నర్ చేత టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు.