Tiruvanantapuram: రోడ్డు మలుపులొో అదుపుతప్పిన బైక్.. బస్సు కిందపడ్డా ప్రాణాలతో..

ఆ యువకుడి టైమ్ బావుంది. అందుకే ప్రాణాలతో బయటపడ్డాడు. రోడ్డు మలుపుల వద్ద జాగ్రత్తగా ఉండాలని తెలిసినా బైకర్స్ స్పీడుగా టర్న్ తీసుకుంటారు. అది కాస్తా పట్టు తప్పింది.

Update: 2026-02-10 07:20 GMT

రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా మలుపుల వద్ద నుంచి వెళుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. అదృష్టం బావుండి అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. 

ఒక యువకుడు నడుపుతున్న బైక్‌ మలుపులో అదుపుతప్పి జారిపడింది. దీంతో బైక్‌పై ఉన్న యువకుడు రోడ్డు మీద పడ్డాడు. ఎదురుగా వస్తున్న బస్సు టైర్‌ కింద పడబోయాడు. అయితే డ్రైవర్‌ బ్రేకులు వేయడంతో చావు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

రోడ్డు మలుపులో నియంత్రణ కోల్పోవడంతో బైక్ జారి ముందుకు వెళ్లింది. దీంతో అతడు రోడ్డుపై పడిపోయాడు. ఎదురుగా వస్తున్న బస్సు కిందకు వెళ్లాడు. కానీ బస్సు డ్రైవర్ అప్రమత్తమై స్లో చేయడంతో టైరు కిందవరకు వెళ్లినా ఏమీ గాయాలు కాలేదు. బస్సు ఆగడంతో అతడు లేచి పక్కకు వెళ్లాడు. 

ఇంతలో ఈ దృశ్యాన్ని చూస్తున్న వారు భయంతో పరుగులు పెట్టుకుంటూ అక్కడికి చేరుకుని ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన ఆ విద్యార్థి మృత్యుంజయుడని నెటిజన్లు కొనియాడారు.

Tags:    

Similar News