భారత్లో శరణార్థులకు ఆశ్రయం ఇవ్వలేమంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 'భారత్ ధర్మశాల కాదు.. వివిధ దేశాల శరణార్థులకు భారత్ ఆశ్రయం ఇవ్వలేదు. తక్షణం శరణార్థులు దేశాన్ని వీడాలి' అంటూ.. సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.. ఈ మేరకు శ్రీలంక శరణార్థులు వేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టి వేసింది. భారతదేశం ప్రపంచం నలుమూలల నుండి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వగల ధర్మశాల కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.. శ్రీలంక తమిళ జాతీయుడి నిర్బంధంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వాలా? మనం 140 కోట్ల మందితో ఇబ్బంది పడుతున్నాము. అన్ని ప్రాంతాల నుంచి వచ్చే విదేశీయులకు వినోదం అందించగల ధర్మశాల కాదు' అని జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 19 కింద స్థిర పడే హక్కు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుందని ఆయన తెలిపారు.