Gujarat : బోరుబావిలో పడ్డ చిన్నారి మృతి
17 గంటలు శ్రమించినా కనపడని ఫలితం;
ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన ఒకటిన్నరేళ్ల చిన్నారి మృతి చెందిందని అధికారులు తెలిపారు. ఈ ఘటన గుజరాత్లో అమ్రేలి జిల్లాలోని సూరజ్‌పురా గ్రామంలో జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో 500 అడుగుల లోతున్న బోరుబావిలో పడిన చిన్నారి 50అడుగుల లోతులో చిక్కుకుపోయింది. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి అగ్నిమాపక, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు. దాదాపు 17గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత శనివారం తెల్లవారుజామున అపస్మారక స్థితిలో చిన్నారిని బయటకు తీశారు. అనంతరం చిన్నారిని సివిల్ ఆస్పత్రిని తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారని అమ్రేలీ అగ్నిమాపక అధికారి హెచ్‌సీ గాధ్వి తెలిపారు.
శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఏడాదిన్నర బాలిక ఆరోహి బోరుబావిలో పడిపోయింది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, స్థానిక యంత్రాంగం, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సహాయక చర్యలు ప్రారంభించింది. ఎన్‌డిఆర్‌ఎఫ్ 17 గంటల సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత శనివారం ఉదయం అపస్మారక స్థితిలో అతన్ని బయటకు తీశారు. చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. బోర్‌వెల్ 500 అడుగుల లోతులో ఉందని ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారి తెలిపారు. అందులో పడిపోవడంతో బాలిక దాదాపు 50 అడుగుల లోతులో చిక్కుకుంది. స్థానిక యంత్రాంగంతో పాటు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం దాదాపు 17గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత శనివారం ఉదయం 5 గంటలకు అపస్మారక స్థితిలో ఉన్న బాలికను బయటకు తీశారని ఆయన చెప్పారు.
బాలికను బోర్‌వెల్ నుంచి బయటకు తీసి సివిల్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారని అమ్రేలీ అగ్నిమాపక అధికారి హెచ్‌సీ గాధ్వి తెలిపారు. సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అగ్నిమాపక విభాగం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిందని, తరువాత గాంధీనగర్ నుండి ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం ఆపరేషన్‌లో చేరిందని ఆయన చెప్పారు. శుక్రవారం రాత్రి 10.20 గంటలకు గాంధీనగర్ నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించింది. బాలికను బతికించే ప్రయత్నంలో 108 అంబులెన్స్ సర్వీస్ టీమ్ ద్వారా బోర్‌వెల్‌లో ఆక్సిజన్ అందించామని గాధ్వి చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైన గంటల్లో బాలికలో ఎలాంటి కదలిక కనిపించలేదన్నారు.