Atal Bihari Vajpayee : అటల్ బిహారీ వాజపేయికి ఘన నివాళులు..

Atal Bihari Vajpayee : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘన నివాళులు అర్పిస్తున్నారు.

Update: 2022-08-16 04:35 GMT

Atal Bihari Vajpayee : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈ ఉదయం ఢిల్లీలోని వాజ్‌పేయి స్మారక స్థలం అయిన సదైవ్ అటల్‌ వద్ద రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖర్‌, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. పుష్పాలు ఉంచి నివాళి అర్పించారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి భారత రాజకీయాల్లో రాజకీయ దురంధరుడిగా తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. రాజనీతిజ్ఞుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ అజాత శత్రువనే గుర్తింపు దక్కించుకున్నారని వాజ్‌పేయిని స్మరించుకున్నారు. దాదాపు ఆరేళ్లపాటు దేశ ప్రధానిగా, బీజేపీ కీలకనేతగా సేవలు అందించారు వాజ్‌పేయి.

Tags:    

Similar News