Mohan Bhagwat: ఆరెస్సెస్‌ను రాజకీయ కోణంలో చూడడం తప్పు: మోహన్ భాగవత్
బీజేపీ కోణం నుంచి ఆర్ఎస్ఎస్‌ను అర్థం చేసుకోవడం తప్పు..
పోలికల ద్వారా, రాజకీయ కోణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను అర్థం చేసుకోవడం తరుచుగా అపార్థాలకు దారి తీస్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం అన్నారు. కోల్‌కతాలో జరిగిన ‘‘ఆర్ఎస్ఎస్ 100 వ్యాఖ్యాన మాల’’ కార్యక్రమంలో ఆయన పఈ కామెంట్స్ చేశారు. ఆర్ఎస్ఎస్ ను కేవలం మరో సేవా సంస్థగా చూడటం సరికాదని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్‌ను కేవలం భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో ముడిపెట్టవదని ఆయన చెప్పారు. చాలా మంది సంఘ్‌ను బీజేపీ కోణం నుంచి అర్థం చేసుకునే ధోరణిని కలిగి ఉన్నారని, అది ఒక పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు.
అంతకుముందు గురువారం జరిగిన యువజన సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. నైతికంగా దృఢమైన, సామాజిక నిబద్ధత కలిగిన స్వయంసేవకులను సృష్టించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని మరియు బలమైన దేశాన్ని నిర్మించడానికి సంస్థ చేస్తున్న నిరంతర ప్రయత్నాలను భగవత్ హైలెట్ చేశారు. నిస్వార్థమైన సేవ, విలువలతో కూడిన జీవనం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన వ్యక్తులు జాతీయ గౌరవాన్ని, అభివృద్ధిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని భగవత్ అన్నారు. గత ప్రభుత్వాలతో ఉన్నట్లే కేంద్రంలోని నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీతో ఆర్ఎస్ఎస్ కు సమన్వయం ఉందని చెప్పారు.