Manasa Sarovara Yatra: మానస సరోవర్‌ యాత్ర జూన్‌ నుంచి

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ;

Update: 2025-04-27 02:09 GMT

అత్యంత పవిత్రమైన కైలాస మానస సరోవర యాత్ర జూన్‌ నుంచి ఆగస్టు వరకు జరుగుతుందని విదేశాంగ శాఖ ప్రకటించింది. భక్తులను బృందాల వారీగా పంపించనున్నట్లు తెలిపింది. ఒక్కొక్క బృందంలో 50 మంది భక్తులు ఉంటారని, ఉత్తరాఖండ్‌ నుంచి లిపులేఖ్‌ కనుమ మీదుగా 5 బృందాలు, సిక్కిం నుంచి నాథులా కనుమ మీదుగా 10 బృందాలు వెళ్తాయని చెప్పింది. భక్తులు kmy.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. యాత్రలో భక్తులు తమ ప్రయాణ, వసతి, ఆహార సదుపాయాల కోసం రూ.56 వేలను చెల్లించాలి. వైద్య పరీక్షలు, చైనా వీసా, పోర్టర్‌, టిబెట్‌ అటానమస్‌ రీజియన్‌, చైనా బోర్డర్‌ రుసుములను ప్రత్యేకంగా చెల్లించాలి. ప్రతి బృందం మొత్తం 22 రోజులు యాత్రలో గడుపుతుంది.

Tags:    

Similar News