అమెరికాలో చదవాలనుకునే వారికి గుడ్ న్యూస్
వీసా స్లాట్లు విడుదల చేసిన ఎంబసీ;
అమెరికాలో చదువుకోవాలని ప్లాన్ చేస్తున్న భారతీయ విద్యార్థులకు ఎఫ్-1 వీసా జారీ ప్రక్రియను ను ప్రారంభించింది అమెరికా ఎంబసీ. దేశవ్యాప్తంగా జూలై నుంచి ఆగస్టు వరకు అందుబాటులో ఉంటాయి. స్లాట్‌ను ఫిక్స్ చేసుకోవడానికి అభ్యర్థులు యూఎస్ ట్రావెల్ డాక్స్ వెబ్‌సైట్‌కి లాగిన్ కావచ్చు.
అమెరికా స్టూడెంట్ వీసా అపాయింట్మెంట్ స్లాట్స్‌ను సోమవారం ప్రారంభించింది. దేశంలోని అన్ని అమెరికా కాన్సులేట్స్‌లో ఈ స్లాట్లు ఓపెన్ అయ్యాయి. దీంతో జులై- ఆగస్టు నెలలకు సంబంధించి ఇవి ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. పూర్తి వివరాల కోసం ustraveldocs.com ను సందర్శించి, తమ స్లాట్ బుక్ చేసుకోవాలని ఇండియాలోని యూఎస్ ఎంబసీ ట్వీట్ చేసింది. యాన్యువల్ స్టూడెంట్ వీసా ఈవెంట్‌ను ఇటీవలే నిర్వహించింది ఇండియాలోని యూఎస్ డిప్లొమాటిక్ మిషన్. దిల్లీ, చెన్నై, హైదరాబాద్, ముంబైల నుంచి 3,500మందికిపైగా విద్యార్థులు ఇందులో పాల్గొని తమ ఇంటర్వ్యూలు ఇచ్చారు. నిజానికి ప్రపంచంలో ఇతర దేశాలతో పోల్చుకుంటే. ఇండియా నుంచే చాలా మంది విద్యార్థులు అమెరికాకు వెళుతున్నారు. 2022లో జారీ చేసిన ప్రతి ఐదు స్టూడెంట్ వీసాల్లో ఒకటి భారతీయులదే అని, అందుకే ప్రతియేటా వీసాల సంఖ్యను పెంచుకుంటూ వెళుతున్నామని అధికారులు చెబుతున్నారు. గతేడాది రికార్డుస్థాయిలో 1,25,000 మంది భారతీయులకు స్టూడెంట్ వీసాను మంజూరు చేసింది అమెరికా.
నిజానికి అమెరికాలో చదువు.. లక్షల మంది విద్యార్థుల కల ! ముఖ్యంగా ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సుల విద్యార్థులు ఫైనల్ ఇయర్‌లో ఉండగానే, అమెరికాలో ఉన్నత విద్యకు ప్రిపేర్ అవ్వడం ప్రారంభిస్తారు. ఇందుకు అవసరమైన స్టాండర్డ్ టెస్ట్‌లకు హాజరవుతుంటారు. అకడమిక్ అర్హతలతోపాటు పూర్తి అవగాహనతో ప్రయత్నిస్తే.. అమెరికా కల సాకారం చేసుకోవచ్చు. విద్యార్థులకు ఒకసారి ప్రవేశం ఖరారైతే, యూనివర్సిటీ ఇచ్చే కన్ఫర్మేషన్ లెటర్ ఆధారంగా ఇమిగ్రేషన్ విభాగంలో ఐ-20 ఫామ్‌ను పూర్తి చేసి వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. వీటిని పరిశీలించిన ఇమిగ్రేషన్ విభాగం అధికారులు సంబంధిత తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలియజేస్తారు. ఇప్పటికే అమెరికా పలు విశ్వవిద్యాలయాలనుంచి ఐ-20 తెప్పించుకున్న విద్యార్థులందరూ ఇంటర్యూ స్లాట్ లు పొందినట్లు సమాచారం.