MODI: మోదీ-ట్రంప్ చేసుకున్న ఒప్పందాలు ఇవే

ట్రంప్-మోదీ చర్చల్లో కీలక ఒప్పందాలకు ఆమోదం... మోదీని పొగడ్తలతో ముంచేసిన ట్రంప్;

Update: 2025-02-14 04:30 GMT

 ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన ముగిసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో కీలక చర్చల అనంతరం ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన ముగిసింది. దీంతో ఆయన భారత్‌కు తిరుగు పయనమయ్యారు. ఈనెల 10న ఫ్రాన్స్ వెళ్లిన మోదీ.. రెండు రోజులు అక్కడ పర్యటించారు. అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో మోదీ భేటీ అయి కీలక చర్చలు జరిపారు. అనంతరం మోదీ అమెరికా వెళ్లారు. 12, 13 తేదీల్లో పర్యటించి అధ్యక్షుడు ట్రంప్ తో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఈ పర్యటనలో పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా రెండు దేశాల మధ్య వాణిజ్యంపై ట్రంప్, మోడీ చర్చించారు. చర్చల అనంతరం ఇరువురు నేతలు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని మోడీతో భేటీకి ముందు ట్రంప్ ‘‘పరస్పర సుంకాల’’పై ప్రకటన చేశాడు. మోదీ తన చాలా కఠినమైన సంధానకర్త అని. చర్చల్లో కఠినంగా వ్యవహరిస్తారన్నారు. ఆయన తన కన్నా చాలా మంచి నెగోషియేటర్, పోటీ కూడా లేదని ట్రంప్ అన్నారు.

చేసుకున్న ఒప్పందాలు ఇవే..

ఇండో పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు పెంచేందుకు నిర్ణయం.

ఖనిజాలు, ఔషధాల కోసం బలమైన సరఫరా గొలుసు సృష్టించాలని నిర్ణయం.

లాస్ ఏంజిల్స్, బోస్టస్‌లో కొత్త భారత కాన్సులేట్లు ప్రారంభం.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పని చేయాలని నిర్ణయం.

అమెరికా నుంచి యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం.

26/11 దాడి సూత్రధారి తహవ్వూర్ ను భారత్ కు అప్పగింత.

మస్క్‌తో భేటీపై ప్రధాని మోదీ ట్వీట్

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌తో భేటీ అయినట్లు ట్వీట్ చేశారు. సంస్కరణల వైపు భారత్ చేస్తున్న ప్రయత్నాల గురించి, ‘మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్’ను మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఆయనతో మాట్లాడినట్లు తెలిపారు. స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి అంశాలపై కూడా చర్చించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా, అనంతరం ప్రెసిడెంట్ ట్రంప్‌తో ఆయన భేటీ కానున్నారు.

Tags:    

Similar News