Uttar Pradesh: సీఎం యోగి పెద్ద ప్రయత్నం: ముస్తఫాబాద్ ని 'కబీర్ధామ్'గా..
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సంత్ కబీర్ తో ఉన్న సాంస్కృతిక సంబంధాన్ని గౌరవించేందుకు ముస్తఫాబాద్ గ్రామాన్ని 'కబీర్ధామ్' గా పేరు మార్చాలని యోచిస్తున్నట్లు ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం లఖింపూర్ ఖేరీ జిల్లాలోని ముస్తఫాబాద్ గ్రామాన్ని 'కబీర్ధామ్'గా పేరు మార్చే ప్రతిపాదనను తమ ప్రభుత్వం తీసుకువస్తుందని చెప్పారు. పేరు మార్పు ఈ ప్రాంతం యొక్క సంత్ కబీర్‌తో ముడిపడి ఉన్న చారిత్రక, మరియు సాంస్కృతిక గుర్తింపును పునరుద్ధరిస్తుందని ఆయన నొక్కి చెప్పారు.
పూర్వ పాలకులు మార్చిన ప్రదేశాల పేర్లను "పునరుద్ధరించడానికి" ఆయన ప్రభుత్వం తీసుకున్న మునుపటి నిర్ణయాలకు ఈ ప్రతిపాదన అనుగుణంగా ఉంది.
"స్మృతి మహోత్సవ్ మేళా 2025" సందర్భంగా జరిగిన సభలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, యుపి ప్రభుత్వం ఇప్పుడు "కబ్రిస్తాన్" సరిహద్దు గోడలను నిర్మించడానికి బదులుగా మతపరమైన, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను పునరుద్ధరించడానికి ఖర్చు చేస్తోందని అన్నారు.
ముస్లిం జనాభా లేనప్పటికీ ఆ గ్రామానికి ముస్తఫాబాద్ అని పేరు పెట్టడం తనను ఆశ్చర్యపరిచిందని ముఖ్యమంత్రి అన్నారు. "నేను ఈ గ్రామం గురించి అడిగినప్పుడు, దాని పేరు ముస్తఫాబాద్ అని నాకు చెప్పారు. ఇక్కడ ఎంత మంది ముస్లింలు నివసిస్తున్నారని నేను అడిగాను, ఎవరూ లేరని నాకు చెప్పారు. అప్పుడు పేరు మార్చాలని చెప్పాను. దానిని కబీర్ధామ్ అని పిలవాలి" అని అన్నాను.
పేరు మార్పు కోసం తమ ప్రభుత్వం అధికారిక ప్రతిపాదనను కోరుతుందని, అవసరమైన పరిపాలనా చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. "మేము ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తాము. ఇది సంత్ కబీర్ వారసత్వంతో ముడిపడి ఉన్న స్థలం యొక్క గౌరవాన్ని పునరుద్ధరించడం గురించి" అని ఆయన అన్నారు.
ఆదిత్యనాథ్ దీనిని ఇటీవలి సంవత్సరాలలో తన ప్రభుత్వం చేపట్టిన పేరుమార్పు కార్యక్రమాలతో పోల్చారు. "గతంలో పాలించిన వారు అయోధ్యను ఫైజాబాద్‌గా, ప్రయాగ్‌రాజ్‌ను అలహాబాద్‌గా, కబీర్‌ధామ్‌ను ముస్తఫాబాద్‌గా మార్చారు. మా ప్రభుత్వం వాటి పేర్లను మళ్లీ తిరిగి తీసుకు వస్తుంది అని ఆయన అన్నారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మత ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి, అందంగా తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. "ప్రతి తీర్థయాత్ర స్థలాన్ని భక్తులకు సౌకర్యంగా ఉండేటట్లు తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించామని అన్నారు. భక్తులకు విశ్రాంతి గృహాలు, ఆశ్రయాలు వంటి సౌకర్యాలు నిర్మించాలి, పర్యాటక, సంస్కృతి విభాగాల ద్వారా, కాశీ, అయోధ్య, కుషినగర్, నైమిశారణ్య, మధుర-బృందావనం, బర్సాన, గోకుల్ లేదా గోవర్ధన వంటి ప్రతి ప్రధాన విశ్వాస స్థలాన్ని మేము పునరుద్ధరిస్తున్నాము" అని ఆయన అన్నారు.
మునుపటి కాలంలా కాకుండా ఇప్పుడు ప్రజా నిధులను సాంస్కృతిక, మతపరమైన పునరుజ్జీవన ప్రాజెక్టుల వైపు మళ్లిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. "గతంలో, ఈ డబ్బు 'కబ్రిస్తాన్' (స్మశానవాటికలు) సరిహద్దు గోడలను నిర్మించడానికి ఉపయోగించబడేది. ఇప్పుడు దానిని మన వారసత్వ కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నారు" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటువంటి ప్రయత్నాలు సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తాయని ఆదిత్యనాథ్ అన్నారు. భారతదేశం యొక్క ఆధ్యాత్మిక, సాంస్కృతిక మూలాలను ప్రతిబింబించే ప్రదేశాల వైభవాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంటుంది" అని ఆయన అన్నారు.