Uttar Pradesh: భర్త చేసిన మంచి పని.. భార్యకు మరొకరితో సంబంధం ఉందని తెలిసి..
పెళ్లికి ముందు ప్రేమలు.. అతడినే పెళ్లి చేసుకోవాలని తలపులు.. అయినా పెద్దల మాట కాదనలేక మరొకరిని పెళ్లి చేసుకోవడం.. అతడితో సంసారం చేయలేక, ప్రియుడిని మర్చిపోలేక హత్యలకు పాల్పడుతున్నారు.. ఇష్టం లేకుండా బలవంతంగా మరొకరిని పెళ్లి చేసుకుని వారి జీవితాలను నాశనం చేయడం ఎందుకు, కన్నవారికి కడుపుకోత మిగల్చడం ఎందుకు, నలుగురి చేత ఛీ అనిపించుకోవడం ఎందుకు.. అందుకే ఈ భర్త చేసింది మంచి పని అందరూ అంటున్నారు.. నిజమే బలవంతంగా ఎవరితోనూ సంసారం చేయించలేరు. అందుకే అతడు తీసుకునే నిజంగా మంచిదే..;
పెళ్లికి ముందు ప్రేమలు.. అతడినే పెళ్లి చేసుకోవాలని తలపులు.. అయినా పెద్దల మాట కాదనలేక మరొకరిని పెళ్లి చేసుకోవడం.. అతడితో సంసారం చేయలేక, ప్రియుడిని మర్చిపోలేక హత్యలకు పాల్పడుతున్నారు.. ఇష్టం లేకుండా బలవంతంగా మరొకరిని పెళ్లి చేసుకుని వారి జీవితాలను నాశనం చేయడం ఎందుకు, కన్నవారికి కడుపుకోత మిగల్చడం ఎందుకు, నలుగురి చేత ఛీ అనిపించుకోవడం ఎందుకు.. అందుకే ఈ భర్త చేసింది మంచి పని అందరూ అంటున్నారు.. నిజమే బలవంతంగా ఎవరితోనూ సంసారం చేయించలేరు. అందుకే అతడు తీసుకునే నిజంగా మంచిదే..
కాన్పూర్ దేహత్‌లోని రసూలాబాద్ ప్రాంతంలోని ఒక వ్యక్తి తన భార్యతో కొనసాగించిన 15 సంవత్సరాల వివాహబంధాన్ని తుడిచిపెట్టేశాడు.. భార్య మరొకరిని ప్రేమిస్తుందని, అతడితె అక్రమ సంబంధం కొనసాగిస్తుందని తెలిసి ముందు గొడవ పడ్డాడు.. తరువాత తనే దగ్గరుండి వారిద్దరికీ వివాహం జరిపించాడు. భార్య తన భర్తతో ఉన్న సంబంధాన్ని ముగించే లిఖిత పత్రాలను కూడా అందించింది.
ఔరంగపూర్ సాంభీకి చెందిన కృపా శంకర్ మిశ్రా కుమార్తె సోని (30) యోగేష్ తివారీ (40)ని 2010 మేలో వివాహం చేసుకున్నట్లు భగ్గ నివాడ గ్రామాధికారి జై చంద్ తెలిపారు. అయితే, కన్నౌజ్‌కు చెందిన వికాస్ ద్వివేది (35)తో సోనీ అక్రమ సంబంధం కొనసాగించిందని జై చంద్ తెలిపారు.
దీని వల్ల దంపతుల మధ్య గొడవలు జరిగాయని ఆయన అన్నారు. ఈ కారణంగానే సోని ఇటీవల తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. సోమవారం, ఆమె తన భర్త ఇంటికి తిరిగి వచ్చింది. ఆ రోజు తర్వాత, వికాస్ కూడా గ్రామానికి వచ్చాడు. అతన్ని గమనించిన యోగేష్ 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.
గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ ఏర్పాటు చేశాడు యోగేష్. సోనీతో తన వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపాడు.. అనంతరం ఊరి దేవాలయంలో తన భార్య సోనీకి, ఆమె ప్రియుడు వికాస్ తో వివాహం జరిపించాడు.. తన 12 కుమారుడిని కూడా ఆమెతో తీసుకెళ్లడానికి సుముఖత వ్యక్తం చేశాడు.. దీంతో గొడవ సద్దుమణిగింది.
మేఘాలయలో హనీమూన్ సమయంలో జరిగిన రాజా రఘువంశీ హత్య దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఈ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయి. గోండాలో, హరిశ్చంద్ర తన భార్య కరిష్మ వివాహాన్ని ఆమె ప్రియుడు శివరాజ్ చౌహాన్‌తో స్థానిక ఆలయంలో ఏర్పాటు చేశాడు.
గతంలో మార్చిలో, సంత్ కబీర్ నగర్‌లో, బబ్లూ తన భార్య రాధిక వివాహం తన భాగస్వామితో ఏర్పాటు చేశాడు. 2017 నుండి వివాహం చేసుకున్న బబ్లూ మరియు రాధికకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.