Vava Suresh: మనోడు గట్టోడు.. 250సార్లు పాములు కాటేసినా బతికాడు..

Vava Suresh: కేరళలో స్నేక్ క్యాచర్‌గా పనిచేస్తున్న సురేష్‌కు పెద్ద రికార్డే ఉంది.

Update: 2022-02-03 08:59 GMT

Vava Suresh (tv5news.in)

Vava Suresh: మామూలుగా పామును దూరం నుండి చూస్తేనే భయంతో పరుగులు తీస్తా్ం. ఒకవేళ ఆ పాము కాస్త దగ్గరగా వచ్చి, తాకిందన్న అనుమానం వచ్చినా చాలు విషం ఎక్కిందేమో అన్న అనుమానంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అలా ఒక్క పాముకాటుకే మరిణించిన వారి సంఖ్య చాలానే ఉంటుంది. కానీ 250 సార్లు పాము కాటేసిన బ్రతికే ఉన్నాడు ఓ మనిషి. అందుకే అందరూ అతడిని స్నేక్ మ్యాన్ అని పిలవడం మొదలుపెట్టారు.

స్నేక్ క్యాచర్ ఉద్యోగం చేయాలంటే చాలా ధైర్యం కావాలి. భయంకరమైన విషంతో నిండిన పాములను చాకచక్యంగా పట్టుకోవాలంటే అంత ఈజీ కాదు. అలా స్నేక్ క్యాచర్స్‌గా పనిచేస్తూ.. ఆ పాముకాటుకే మరణించిన వారు కూడా ఉన్నారు. ఒకవేళ ఆయువు గట్టిగా ఉంటే ఒకసారి కాకపోతే రెండోసారి పాముకాటుకు అయినా మృత్యువును చూడాల్సిందే. కానీ కేరళ కొట్టాయంకు చెందిన సురేష్ అలా కాదు.. ఏకంగా 250 సార్లు పాముకాటుకు గురయినా కూడా ఇంకా ఆరోగ్యంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.

కేరళలో స్నేక్ క్యాచర్‌గా పనిచేస్తున్న సురేష్‌కు పెద్ద రికార్డే ఉంది. సురేష్ కెరీర్‌లో ఇప్పటివరకు 50,000 పాములను పట్టుకున్నాడు. అందులో 190కి పైగా కింగ్ కోబ్రాలు కూడా ఉన్నాయి. నేషనల్ జియోగ్రాఫిక్, యానిమల్ ప్లానెట్ వంటి ఛానెల్స్‌లో సురేష్ వీడియోలు చేశాడు. అందుకే ఆయనను స్నేక్ మ్యాన్ ఆఫ్ కేరళ అని పిలుచుకుంటారు.

జనవరి 31 న కొట్టాయంలో ఓ పామును పట్టుకునే ప్రయత్నంలో ఆ పామును తనను కాటువేసింది. అపస్మారక స్థితిలో ఉన్న తనను స్థానికులు కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించారు. అప్పటినుండి అతడికి వెంటిలేటర్‌పైనే చికిత్సను అందిస్తున్నారు వైద్యులు. ఇటీవల తాను పూర్తిగా కోలుకున్నట్టు వారు తెలిపారు. కాకపోతే పాముకాటు వల్ల తన చూపుడు వేలు, కుడి మణికట్టులో కదలికలను వారు వెల్లడించారు.

Tags:    

Similar News