Venkaiah Naidu Manmohan : మన్మోహన్‌ను కలిసిన వెంకయ్య నాయుడు
Venkaiah Naidu Manmohan : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను పరామర్శించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు;
Venkayya Manmohan : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను పరామర్శించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. గురువారం మన్మోహన్ నివాసానికి వెళ్లిన వెంకయ్య....ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దీనికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మన్మోహన్ సింగ్ ఆరోగ్యంగా, ఆనంద జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మన్మోహన్...అనారోగ్య సమస్యల కారణంగా వర్షాకాల సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ ఛైర్మన్‌గా ఉన్న వెంకయ్య పదవీకాలం ఈ నెల 10తో ముగియనుంది.