Uri Sector : యురీ సెక్టార్ లో యుద్ధ వాతావరణం

Update: 2025-05-09 12:00 GMT

యుద్దానికి కాలు దువ్విన పాకిస్తాన్‌ వక్రబుద్దిని ప్రదర్శిస్తోంది. జనావాసాలు లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. యురి సెక్టార్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. బాంబుల మోతలతో యూరి ప్రాంతం దద్దరిల్లుతోంది. యూరీలో కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్‌ను భారత సైన్యం తిప్పికొడుతోంది. కాల్పులతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బంకర్లు, సురక్షిత ప్రాంతాల్లోకి పరుగులు పెడుతున్నారు. ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.

పాక్ దాడిలో జనావాసాలు ధ్వంసమయ్యాయి. జనావాసాలపై షెల్లింగ్‌లతో దాడులకు తెగబడటంతో పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా.. మరికొన్ని నేలమట్టమయ్యాయి. పాక్ దాడితో ఇళ్లను కోల్పోయిన బాధితులు ఆవేదన చెందుతున్నారు. జనావాసాలపై పాక్ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. దమ్ముంటే తమ ఆర్మీతో పోరాడాలి కానీ ఇలా జనావాసాలను టార్గెట్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. 

Tags:    

Similar News