Partha Chatterjee: మాజీమంత్రి పార్థా ఛటర్జీపై చెప్పు విసిరిన మహిళ..

Partha Chatterjee: పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్ మెంట్ కుంభకోణంలో పార్థా ఛటర్జీని ఈడీ అరెస్ట్ చేసింది.

Update: 2022-08-03 14:45 GMT

Partha Chatterjee: దేశంలో ఇప్పుడు పార్థా ఛటర్జీ పేరు మారమోగుతోంది. పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్ మెంట్ కుంభకోణంలో పార్థా ఛటర్జీని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంలో రూ. 55 కోట్లకు పైగా నగదు పట్టుబడింది. దీంతో ఆయనపై సీఎం మమతా బెనర్జీ వేటు వేసింది. మంత్రి పదవి నుంచి తొలగించారు. తాజాగా పార్థా ఛటర్జీకి చేదు అనుభవం ఎదురైంది. చికిత్స కోసం ఈఎస్ఐ ఆసుపత్రికి వచ్చిన ఆయనపై ఓ మహిళ చెప్పు విసిరింది. అయితే పార్థ ఛటర్జీకి ఆ చెప్పులు తగల్లేదు. అది అతని కారుపై పడింది.ఆమె అంటాలా నివాసానికి చెందిన సుభద్రగా గుర్తించారు.

చెప్పు విసిరిన మహిళ పార్థ ఛటర్జీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పేద ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును ఆయన దండుకున్నారని అన్నారు. తాను విసిరిన చెప్పు ఆయన తలకు తగిలి ఉంటే ఎంతో సంతోషించేదాన్నని చెప్పారు. కుంభకోణం బయట పడిన తర్వాత కూడా ఆయనకు ఖరీదైన సేవలను ఎందుకు అందిస్తున్నారని ప్రశ్నించారు. ఆయనకు వీల్ ఛైర్ ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు.

48 గంటలకోసారి పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆయన్ని పోలీసులు ఈఎస్‌ఐ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆ మహిళ కూడా ఆరోగ్య పరీక్షల కోసం అక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. అక్కడ పార్థ ఛటర్జీని చూడగానే తన పాదాల నుంచి రెండు చెప్పులను తీసి పార్థ ఛటర్జీకిపైకి విసిరింది. ఆ టైంలో పార్థ ఛటర్జీ మాత్రం కారులో ఉన్నారు.

పార్థఛటర్జీపై చెప్పులు విసిరిన మహిళ గృహిణిగా తెలుస్తుంది. ఆమెకు ఒక కుమార్తె కూడా ఉంది.. అయితే పేద ప్రజల డబ్బుతో అతను ఇళ్లు కొన్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్థ కారు వెళ్లిన తర్వాత ఆమెను జర్నలిస్టులు చుట్టుముట్టారు. కోర్టు ఆదేశాల మేరకే పార్థఛటర్జీ, అర్పితా ముఖర్జీలకు పోలీసులు 48 గంటలకోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్యనే వారిని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో పరీక్షలు జరిగేలా చూస్తున్నారని ఆమె మండిపడ్డారు. 

Tags:    

Similar News