Ratan Tata : రతన్ టాటా వారసుడు ఎవరు?

Update: 2024-10-10 09:15 GMT

రతన్ టాటా మరణం తర్వాత ఆయన ఆస్తులకు వారసుడు ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. 2024 లెక్కల ప్రకారం టాటా ఆస్తుల నికర విలువ రూ.3800 కోట్లు. అయితే రతన్ టాటాకు పెళ్లి కాకపోవడంతో ఆయన ఆస్తి ఎవరికి దక్కుతుందనే ప్రశ్న అందరిలో ఇప్పుడు తలెత్తుతుంది. రతన్ టాటా తండ్రి రెండో భార్యకు పుట్టిన నోయెల్ టాటా కుటుంబానికి రతన్ టాటా ఆస్తులు చెందే అవకాశం ఉన్నట్లు సమాచారం. నోయెల్ టాటాకు మాయ,నావల్,లియా టాటా అనే ముగ్గురు పిల్లలున్నారు. రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా కుమార్తె మాయ టాటా ప్రస్తుతం తన తోబుట్టువులతో కలసి టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో పనిచేస్తున్నారు. మాయ తల్లి దివంగత టాటా గ్రూప్ చైర్మన్ సైరన్ మిస్త్రీ సోదరి,దివంగత బిలియనీర్ పల్లోంజి మిస్త్రీ కుమార్తె.

మాయ టాటా సోదరుడు నెవిల్లే టాటా..ట్రెంట్ లిమిటెడ్ కింద టాటా స్టార్ బజార్ అనే హైపర్ మార్కెట్ చైన్ కు నాయకత్వం వహిస్తున్నారు. జూడియో,వెస్ట్ సైడ్ ల బాధ్యతలు కూడా నెవిల్లే చూస్తున్నాడు.ఇతనే టాటా గ్రూప్ కు అసలైన వారసుడని చాలా మంది నమ్ముతారు. నెవిల్లే టయోటా కిర్లోస్కర్ గ్రూప్ వారసురాలు మాన్సీ కిర్లోస్కర్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి జంషెడ్ టాటా అనే కొడుకు ఉన్నారు.

మాయ టాటా సోదరి లియో టాటా గతంలో తాజ్ హోటల్స్,రిసార్ట్స్,ప్యాలెస్ లలో పని చేసింది. ఇప్పుడు లియో టాటా..టాటా గ్రూప్ హోటల్స్ ఆపరేషన్స్ ని మేనేజ్ చేసే ఇండియన్ హోటల్ కంపెనీ కార్యకలాపాలు చూస్తున్నారు. ఆమె దృష్టి ఇప్పుడు హోటల్ పరిశ్రమపైనే ఉంది.

Tags:    

Similar News