Ravi Shankar Prasad : కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉంది : బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్

Update: 2025-09-25 07:27 GMT

ప్రతిపక్ష కూటమి సారథ్య బాధ్యతలు తీసుకునేందుకే బిహార్ లో కాంగ్రెస్ పార్టీ CWC సమావేశం నిర్వహించిందని బీజేపీ విమర్శించింది. కానీ బిహార్ ప్రజలు మళ్లీ NDAను గెలిపించేందుకే నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ఆర్జేడీ పాలనలో..భయం, కిడ్నాప్ లు,అవినీతిని ప్రజలు చూశారని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ఆర్జేడీ పాలనలో కిడ్నాప్ లు, అవినీతి, కుంభకోణాలు, కుల వివక్ష కొనసాగినప్పుడు ఎందుకు కాంగ్రెస్ మౌనంగా ఉందని నిలదీశారు. బిహార్ లో పార్టీ పరిస్థితి ఏమిటో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించే బిహార్ లో CWC సమావేశం పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. కూటమి సారథ్య బాధ్యతలు తీసుకుని, ఎన్నికల్లో ఆర్జేడీ నుంచి ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే ఉద్దేశంలో.. కాంగ్రెస్ ఉందన్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ను ఎందుకు ప్రతిపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంలేదని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. బిహార్ కు ఎవరు వచ్చినా, పోయినా NDA గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు.

Tags:    

Similar News