పాకిస్తాన్ వెనక్కి తగ్గనుందా? ఆపరేషన్ సిందూర్ తర్వాత మారిన మంత్రి స్వరం..

భారత దాడులకు బలమైన ప్రతిస్పందన ఇస్తామని ప్రతిజ్ఞ చేసిన తర్వాత పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తన వైఖరిని మార్చుకున్నారు.;

Update: 2025-05-07 11:05 GMT

భారత దాడులకు బలమైన ప్రతిస్పందన ఇస్తామని ప్రతిజ్ఞ చేసిన తర్వాత పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తన వైఖరిని మార్చుకున్నారు. భారతదేశంతో ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి సంసిద్ధతను వ్యక్తపరుస్తున్నారు.

బ్లూమ్‌బెర్గ్ టీవీతో మాట్లాడుతూ, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత రెండు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 

"గత 15  రోజులుగా మేము భారతదేశానికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రతికూల చర్య తీసుకోబోమని చెబుతున్నాము. కానీ మాపై దాడి జరిగితే, మేము ప్రతిస్పందిస్తాము. భారతదేశం వెనక్కి తగ్గితే, మేము ఖచ్చితంగా దీనికి ముగింపు పలుకుతాము అని రక్షణ మంత్రి అన్నారు.

"భారతదేశం మన భూమిలో ఒక్క అంగుళం అయినా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే, అది దుస్సాహసం అవుతుంది" అని ఆయన పాకిస్తాన్ మీడియా జియో న్యూస్‌తో అన్నారు. "మేము పూర్తి శక్తితో ప్రతిస్పందిస్తాము అని తెలిపారు. 

పాకిస్తాన్ ప్రతిస్పందన దౌత్యపరంగా ఉంటుందని ఆసిఫ్ పేర్కొన్నారు. ఇస్లామాబాద్ చర్య తీసుకోవడానికి "ఎక్కువ సమయం పట్టదు" అని కూడా అన్నారు. ఆపరేషన్ సిందూర్ అనే కోడ్‌నేమ్‌తో 25 నిమిషాల పాటు జరిగిన మెరుపు దాడిలో, బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) లోపల తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేసింది.

జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం), లష్కరే-ఎ-తోయిబా (ఎల్‌ఇటి), హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన క్షిపణి దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని వర్గాలు తెలిపాయి.

పాకిస్తాన్ సైనిక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోలేదని, ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ జరిగిందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఈ దాడులను ఖండించింది. తమ సైన్యం ఈ రెచ్చగొట్టే చర్యకు ప్రతిస్పందిస్తుందని తెలిపింది.


Tags:    

Similar News