కొడుకు కాలేజీ ఫీజు కట్టేందుకు డబ్బుల్లేవని.. బస్సుకు ఎదురెళ్లి..
పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. వచ్చిన డబ్బులతో ఇల్లుగడుపుతూ, పిల్లల్ని చదివిస్తోంది.
పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. వచ్చిన డబ్బులతో ఇల్లుగడుపుతూ, పిల్లల్ని చదివిస్తోంది. కానీ కాలేజీ చదువులు చదివించే స్థోమత ఆ తల్లికి లేదు.. దీంతో ఓ అోచన చేసింది. తాను మరణిస్తే కొంత పరిహారం పిల్లలకు అందుతుందని దాంతో వాళ్లు చదువుకుంటారని భావించింది. అంతేగానీ అమ్మలా తన బిడ్డలను అక్కున చేర్చుకునే వారు ఎవరు ఉంటారని ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయింది. బస్సుకు ఎదురెళ్లి మరణించింది.
తమిళనాడులోని సేలంలో 45 ఏళ్ల మహిళ తన కొడుకు కాలేజీ ఫీజు చెల్లించేందుకు డబ్బుల్లేక , ఇరుగు పొరుగు వారిని అడగలేక తనువు చాలించింది. తాను మరణిస్తే పరిహారం అందుతుందని భావించింది. పాపతి అనే మహిళ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. భర్త నుండి విడిపోయింది. గత 15 సంవత్సరాలుగా కుమార్తె, కొడుకును పోషిస్తోంది.
తన కొడుకు, కూతురికి కాలేజీ ఫీజు కట్టలేకపోతున్నానని పాపతి రోజూ ఆలోచనలో ఉండేదని పోలీసులు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుందని ఎవరో అనుకుంటుంటే విన్నది. తాను కూడా అలాగే చేయాలని భావించింది. కొడుకు, కూతురిని ఒంటరి వాళ్లను చేసి వెళ్లిపోయింది. మరణించిన తల్లి ఆత్మకు శాంతి కలగాలంటే ఆ బిడ్డలు బాగా చదువుకోవాలని చుట్టుపక్కల వారు మాట్లాడుకుంటున్నారు. కానీ అమ్మ లేని ఎవరూ తీర్చలేనిది. చిన్నప్పుడే నాన్నకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు అమ్మకూడా వెళ్లి పోయింది. ఇక తమ బాగోగులు ఎవరు పట్టించుకుంటారని పాపతి బిడ్డలు తల్లి మృతదేహం వద్ద బోరున విలపిస్తున్నారు.