అమె ఔదార్యం.. తల్లిపాలను దానం చేసి, శిశువుల ప్రాణాలను కాపాడి..

తమిళనాడులోని తిరుచ్చికి చెందిన ఒక మహిళ ప్రభుత్వ పాల బ్యాంకుకు 300 లీటర్లకు పైగా తల్లి పాలను విరాళంగా ఇవ్వడం ద్వారా జాతీయ రికార్డు సృష్టించింది.;

Update: 2025-08-08 05:47 GMT

తమిళనాడులోని తిరుచ్చికి చెందిన ఒక మహిళ ప్రభుత్వ పాల బ్యాంకుకు 300 లీటర్లకు పైగా తల్లి పాలను విరాళంగా ఇవ్వడం ద్వారా జాతీయ రికార్డు సృష్టించింది.

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాకు చెందిన ఒక మహిళ ప్రభుత్వం నిర్వహించే పాల బ్యాంకుకు 300 లీటర్లకు పైగా తల్లి పాలను విరాళంగా ఇచ్చి, దేశంలోనే అత్యధికంగా తల్లి పాలు ఇచ్చిన వ్యక్తిగా కొత్త జాతీయ రికార్డు సృష్టించింది.

సెల్వ బృందా గత 22 నెలలుగా ఈ విరాళం అందిస్తోంది. ఈ పాలు నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్న చాలా మంది బలహీనమైన శిశువులకు ప్రాణాలు పోస్తున్నాయి. 

2023లో బృంద రెండవ కుమార్తె పుట్టిన వెంటనే నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరింది. బృంద తన బిడ్డకు పాలు ఇవ్వడానికి తన తల్లిపాలను పిండాల్సి వచ్చింది. ఆమె అనుమతితో ఆమె నుండి అధికమైన తల్లిపాలను అదే యూనిట్‌లోని ఇతర శిశువులకు దాత పాలుగా ఉపయోగించారు. బృంద  నిస్వార్థ సహకారానికి బీజం పడింది ఇక్కడే. ఇది ఇప్పుడు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గుర్తింపు పొందేలా చేసింది. 

ఏప్రిల్ 2023 మరియు ఫిబ్రవరి 2025 మధ్య బృంద ఇచ్చిన పాలు అన్నీ మహాత్మా గాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రి పాల బ్యాంకుకు వెళ్లాయి.

బృందా మాట్లాడుతూ, "నా తల్లి పాలతో ఇప్పటివరకు 1,000 మందికి పైగా శిశువులు రక్షించబడ్డారు. అది తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ, కొత్త తల్లులందరూ తమ అధిక తల్లి పాలను దానం చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. వారి చిన్న సహకారం నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్న చాలా మంది శిశువుల ప్రాణాలను కాపాడుతుంది" అని అన్నారు.


Tags:    

Similar News