Bengaluru: 13వ అంతస్తు నుంచి పడి యువతి మృతి

రీల్స్‌ పిచ్చే బలి తీసుకుందా?;

Update: 2025-06-27 04:45 GMT

తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడానికి వెళ్లిన ఒక యువతి, నిర్మాణంలో ఉన్న భవనంలోని 13వ అంతస్తు నుంచి పడి మరణించింది. బుధవారం రాత్రి ఆ మహిళ తన స్నేహితుల బృందంతో కలిసి పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆ భవనానికి వెళ్లిందని పోలీసులు వెల్లడించారు.

సోషల్ మీడియా మోజులో పడి యువత ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితులు తల్తెత్తున్నాయి. వ్యూస్ కోసమో.. లేదంటే ఫేమస్ కోసమో తెలియదు గానీ సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎక్కడో చోట ఈ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నా.. యువత మాత్రం గుణ పాఠం నేర్చుకోవడం లేదు. అర్ధాంతరంగా చనిపోవడంతో కన్న వారికి గర్భశోకాన్ని మిగులుస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. రీల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు 13వ అంతస్తు నుంచి పడి చనిపోయింది.

బెంగళూరులో 13 అంతస్తుల బిల్డిండ్ నిర్మాణం జరుగుతోంది. అయితే కొందరు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడానికి యువతి 13వ అంతస్తుకు వెళ్లారు. పార్టీ చేసుకుంటుండగా రీల్స్ చేయడానికి సిద్ధపడింది. అయితే ఉన్నట్టుండి భవనంలో ఏర్పాటు చేస్తున్న లిఫ్ట్ షాఫ్ట్‌లో పడి పోయింది. ఎత్తు నుంచి పడిపోవడంతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలి నుంచి మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి స్నేహితుల బృందంతో కలిసి యువతి పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలోని భవనానికి వెళ్లిందని అధికారులు తెలిపారు. పార్టీ చేసుకుంటుండగా లిఫ్ట్ కోసం ఏర్పాటు చేయాల్సిన షాఫ్ట్‌లో పడిపోయిందని అధికారి తెలిపారు. ఆమె రీల్ షూట్ చేస్తున్నట్లు తెలిసిందని.. అయితే ఆమె ఫోన్ నుంచి మాత్రం ఏలాంటి ఆధారాలు దొరకలేదని వెల్లడించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. ప్రమాదవశాత్తు చనిపోయిందా? ఇంకేదేమైనా కారణం ఉందా? అని తేలాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం అసహజ మరణంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News