ఛానెల్ కోసం వీడియో తీస్తూ 300 కి.మీ వేగంతో.. యూట్యూబర్ దుర్మరణం
కొన్ని చావులు కోరి తెచ్చుకోవడమే.. సరిగ్గా వెళితేనే సమయానికి ఇంటికి వస్తామో లేదో తెలియని రోజులు..;
కొన్ని చావులు కోరి తెచ్చుకోవడమే.. సరిగ్గా వెళితేనే సమయానికి ఇంటికి వస్తామో లేదో తెలియని రోజులు.. అలాంటిది పరిమితికి మించిన వేగంతో ప్రయాణించి నిష్కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు.. తనవారికి దు:ఖాన్ని మిగిల్చాడు. యూట్యూబర్ అగస్త్య చౌహాన్ ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన జరిగింది.
ప్రొఫెషనల్ బైకర్ అగస్త్య చౌహాన్ బుధవారం యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. సూపర్‌బైక్‌పై గంటకు 300 కి.మీ వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అగస్త్య చౌహాన్ వృత్తి రీత్యా బైకర్. తన యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియో తీస్తున్న అతను.. తొలిసారిగా తన ZX10R నింజా సూపర్‌బైక్‌లో గంటకు 300 కి.మీ వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నించాడు.
బైక్ వేగంగా వెళ్ళడంతో డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో అతని హెల్మెట్ ముక్కలైంది. బైక్ మీద నుంచి పడిపోయాడు. తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో రైడర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని శరీరం రక్తంతో తడిసి ముద్దయ్యింది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన అగస్త్య చౌహాన్ ఆగ్రా నుంచి తన రేసింగ్ బైక్‌పై న్యూఢిల్లీకి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అగస్త్య 'PRO RIDER 1000' అనే యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నాడు. ఆ ఛానెల్‌కు 1.2 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 16 గంటల క్రితం అగస్త్య చివరిసారిగా యూట్యూబ్‌లో వీడియోను అప్‌లోడ్ చేశాడు. న్యూఢిల్లీకి చేరుకోవాలని స్నేహితులకు విజ్ఞప్తి చేశాడు.
స్త్య బైక్ నడుపుతూ తన ఛానెల్ కోసం వ్లాగ్ చేస్తూ ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసేవాడు. తన ఛానెల్‌లో కొత్త వీడియోను అప్‌లోడ్ చేసిన ప్రతిసారీ వేగంగా డ్రైవ్ చేయవద్దని చెబుతుంటాడు.. కానీ అతడే బైక్‌ని వేగంగా నడుపుతూ ప్రాణాలు కోల్పోయాడు.