Mizoram: మిజోరం ముఖ్యమంత్రిగా లాల్దుహోమా
ఈ నెల 8వ తేదీన ప్రమాణస్వీకారం;
ఈశాన్య రాష్ట్రం మిజోరంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. జోరం పీపుల్స్ మూమెంట్ నేత లాల్దుహోమా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఐజ్వాల్‌లో మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును కలిసిన లాల్దూహోమా ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. అందుకు గవర్నర్ కూడా సమ్మతి తెలియజేశారు. మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలకు గాను 27 చోట్ల ZPM విజయఢంకా మోగించింది. లాల్దుహోమాతో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు ఆ రోజే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
4 ఏండ్ల వయసున్న లాల్దుహోమా.. ఐపీఎస్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. పదవీ విరమణ అనంతరం ఆయన రాజకీయాల వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. గోవా, ఢిల్లీలో ఆయన ఐపీఎస్‌గా పని చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇంచార్జి ఆఫీసర్‌గా కూడా పని చేశారు లాల్దుహోమా. అదే సమయంలో రాజకీయాలకు ఆకర్షితుడైన లాల్దుహోమా తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేశారు. 1984లో లోక్‌సభకు ఎన్నికయ్యారు.