Hima Das As DSP : డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్‌గా హిమదాస్!
Hima Das As DSP : స్టార్ స్ప్రింటర్ హిమదాస్‌ను డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్‌గా నియమించాలని నిర్ణయించింది అసోం ప్రభుత్వం.;
స్టార్ స్ప్రింటర్ హిమదాస్‌ను డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్‌గా నియమించాలని నిర్ణయించింది అసోం ప్రభుత్వం. అసోం పోలీస్ విభాగంలో హిమదాస్‌తో పాటు మరికొంత మంది క్రీడాకారులను తీసుకున్నారు. ఒలింపిక్, ఆసియా, కామన్వెల్త్ పతక విజేతలను క్లాస్-1 అధికారులుగా నియమించనున్నాట్లు తెలిపింది. ఇక 20 ఏళ్ల ఈ అస్సామీ స్టార్ స్పింటర్ హిమ IAAF వరల్డ్ అండర్-20 ఛాంపియన్ షిప్స్‌లో గ్లోబల్ ట్రాక్ ఈవెంట్ ఫార్మాట్‌లో బంగారు పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ అథ్లెట్‌గా రికార్డు సాధించింది.
హిమదాస్ అసోం లోని నాగయోన్ జిల్లాలోని ఢింగ్ గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబంలో జన్మించింది. తండ్రిపేరు రొంజిత్ దాస్ ,తల్లి పేరు జొనాలి దాస్.కుటుంబంలోని నలుగురు పిల్లలలో హిమదాస్ చివరిది. ఆమె తండ్రి స్థానికంగా వరి పండించే రైతు. చిన్నతనం నుండీ క్రీడలపై మక్కువ కనిపించే హిందాస్ ప్రపంచ ట్రాక్ ఈవెంట్ ప్రస్థానం అంచలంచలుగా సాగింది.