Commonwealth Games 2022: కామన్వెల్త్‌లో భారత్ హవా.. పతకాల పట్టికలో 4వ స్థానం..
Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్ వేదికగా జరిగుతున్న కామన్వెల్ గేమ్స్‌లో భారత్ దూసుకెళ్తోంది.;
Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్ వేదికగా జరిగుతున్న కామన్వెల్ గేమ్స్‌లో భారత్ దూసుకెళ్తోంది. పతకాల పట్టికలో దూసుకెళ్తున్న భారత్ 17 స్వర్ణాలతో న్యూజిలాండ్‌ను వెనక్కి నెట్టి నాలుగులో స్థానానికి ఎగబాకింది. నేటితో కామన్వెల్త్ గేమ్స్ ముగియనుండటంతో...భారత్ మూడోస్థానానికి చేరుకోవాలంటే మరో ఏడు స్వర్ణాలు సాధించాల్సి ఉంది. ఇవాళ ఒక్కరోజే సమయం ఉండటంతో..గోల్డెన్ ఛాన్స్‌పై ఉత్కంఠ నెలకొంది.
కామన్వెల్త్ గేమ్స్‌లో అత్యత్తుమ ప్రదర్శనతో భారత క్రీడాకారులు కనక వర్షం కురిపిస్తూ భారత కీర్తి పతకాన్ని ఎగురవేస్తున్నారు. భారత బాక్సర్లు పంచ్‌లతో విరుచుకుపడటంతో.. బంగారంతో సహా అనేక పతకాలు సాధించారు. నీతూ, నిఖత్ జరీన్, అమిత్ పంఘల్ బాక్సింగ్‌లో దుమ్మురేపేశారు. నిఖత్ అందించిన తాజా గోల్డ్‌మెడల్‌తో మనదేశ స్వర్ణాల సంఖ్య 17కు పెరిగాయి. మొత్తం పతకాల సంఖ్య 48కిచేరటంతో.. న్యూజిలాండ్‌ని వెనక్కి నెట్టి భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది.
అటు భారత మహిళల క్రికెట్ జట్టు కామన్వెల్త్ లో తొలిసారిగా ఫైనల్స్‌కు చేరుకుంది. భారత జట్టు ఇప్పుడు స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాలనుకుంటోంది. అయితే, ఆస్ట్రేలియా రూపంలో భారత్‌కు అత్యంత కఠినమైన సవాలు ఎదుర్కొననుంది. బ్యాడ్మింటన్‌లోనూ భారత్‌కు స్వర్ణం గెలిచే ఛాన్స్ ఉంది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ ఫైనల్స్‌కు చేరుకుంది.
ఈ మూడు ఫైనల్ మ్యాచ్‌లు ఇవాళ జరగనున్నాయి. ఈ మూడింటిలోనూ భారత్ స్వర్ణాలు సాధించే అవకాశం లేకపోలేదు. పురుషుల హాకీలో భారత్‌కు భారీ ఆశలు నెలకొన్నాయి. దక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ప్రస్తుతం టీమిండియాకు అతిపెద్ద సమస్య ఆస్ట్రేలియా రూపంలో నిలవనుంది. కానీ ఇటీవల భారత జట్టు మంచి ప్రదర్శన ఆకట్టుకుంటోంది. దీంతో ఫైనల్ గెలిచి స్వర్ణం సాధించవచ్చనే ఆశలు బలంగా ఉన్నాయి.