Tokyo Olympics 2021: సెమీస్‌లో ఓడినా ఫైనల్ బెర్త్ !

Tokyo Olympics 2021: గత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన ఒలింపిక్స్ ఈ ఏడాది అట్టహాసంగా ప్రారంభంకానున్నాయి.

Update: 2021-07-12 10:09 GMT

Tokyo Olympics 2021: గత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన ఒలింపిక్స్ ఈ ఏడాది అట్టహాసంగా ప్రారంభంకానున్నాయి. ఒలింపిక్ జ్యోతి.. క్రీడల వేదికైన టోక్యో కూడా చేరుకుంది. ఒలింపిక్ గేమ్స్ నిర్వహణకు కోసం సర్వం సిద్ధమైంది. ఒకవైపు కరోనా వైరస్ భయపెడుతున్నా.. మరోవైపు కట్టుదిట్టమైన రక్షణ చర్యల మధ్య సమ్మర్ గేమ్స్ నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా విజృంభణ దృష్ట్యా టోక్యోలో హెల్త్ ఎమెర్జెన్సీ కూడా విధించారు.

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ, అంతర్జాతీయ సమాఖ్యలు సంయుక్తంగా ఈ నూతన గైడ్ లైన్స్ విడుదల చేశాయి. ఈ క్రమంలో సెమీఫైనల్లో ఓడిన బృందానికి ఫైనల్‌ ఆడే అవకాశం వచ్చేలా కనిపిస్తుంది. అలా జరగాలంటే ఆ జట్టుకు అదృష్టం తలుపు తట్టాలి. ఇంతకీ అసలు సంగతి ఏంటంటే.. హాకీ, టెన్నిస్, రెజ్లింగ్, అథ్లెటిక్స్‌తో పాటు ఇతర క్రీడల్లో ఈ నూతన నిబంధన అమల్లోకి రానుంది. పోటీల్లో సెమీస్ చేరి ఓడిన జట్లకు మరోసారి కాంస్యం పతకం కోసం పోటీ జరుగుతుంది. రెజ్లింగ్, టెన్నిస్, అథ్లెట్లిక్స్‌కూ ఇదే నిబంధన వర్తిస్తుంది.

ఎవరైనా క్రీడాకారులు కోవిడ్‌తో తప్పుకుంటే వారి తర్వాత ఉత్తమ ప్రదర్శన కనబర్చిన అథ్లెట్లకు పోటీపడే అవకాశాన్ని ఇవ్వనున్నారు. ఇక హాకీ క్రీడా విషయానికి వస్తే ఏదైనా జట్టు కరోనా వైరస్ కారణంగా తప్పుకుంటే ఆ జట్టు చేతిలో సెమీస్‌లో ఓడిన టీమ్ నేరుగా ఫైనల్‌ పోరులో తలపడుతుంది. దీంతో సెమీఫైనల్లో ఓడినా.. స్వర్ణం కోసం పోరాడే అవకాశం రావొచ్చు. కానీ ఫైనల్‌ చేరిన రెండు జట్లలో ఏదైనా కరోనా కారణంగా తప్పుకుంటే అది సాధ్యపడుతుంది. రెజ్లింగ్, టెన్నిస్, అథ్లెట్లిక్స్‌కూ ఇదే నిబంధన వర్తిస్తుంది.

భారత పురుషుల, మహిళల హాకీ జట్లు టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ సాధించాయి. ఇక జూలై 23 నుంచి ఆగస్టు 8వరకు జరిగే ఈ పోటీలో 26 మందితో కూడిన భారత అథ్లెటిక్స్ బృందం పాల్గొననుంది. 

Tags:    

Similar News