ప్రపంచ బ్యాడ్మింటన్ అసోసియేషన్ -2021లో...సెమీ ఫైనల్స్‌కు వెళ్లిన శ్రీకృష్ణ ప్రియ కుదరవల్లి..!
పోలండ్‌లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ అసోసియేషన్ పోలిష్ ఓపెన్ 2021లో... శ్రీకృష్ణ ప్రియ కుదరవల్లి సెమిఫైనల్స్‌కు చేరుకుంది.;
పోలండ్‌లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ అసోసియేషన్ పోలిష్ ఓపెన్ 2021లో... శ్రీకృష్ణ ప్రియ కుదరవల్లి సెమిఫైనల్స్‌కు చేరుకుంది. ఈ టోర్నమెంట్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లు, 3 సెట్స్‌లో ఆమె గెలిచింది. ఫస్ట్‌రౌండ్‌లో స్వీడన్‌కు చెందిన ఎదిత్ ఉరెల్‌ను, రెండో రౌండ్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన తెరేజా స్వాబికోవాపై విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో డెన్మార్క్‌కు చెందిన సిమోనా పిల్‌గార్డ్‌ను ఓడించారు. సెమిఫైనల్స్‌లో.. ఇస్టోనియాకు చెందిన క్రిస్టీనా కూబాతో తలపడనుంది. కేవలం గంట సమయంలో ఫస్ట్, సెకెండ్ రౌండ్‌లో చాలా ఎనర్జీటిక్‌గా ఆడింది శ్రీకృష్ణ ప్రియ కుదరవల్లి.