టీసీఎస్ ఉద్యోగులకు శుభవార్త

అత్యుత్తమ పనితీరు కనబరచిన ఉద్యోగులకు సంస్థలో భాగస్వామ్యం;

Update: 2023-04-18 10:18 GMT

భారతదేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) సంస్థలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఉద్యోగులను బోర్డులో కొనసాగించబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఉద్యోగులకు 12-15 శాతం జీతాలు పెంచేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. క్యాంపస్ రిక్రూట్‌ల మూల వేతనాల పెంపును కూడా కంపెనీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విధానాన్ని ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, విప్రో వంటి సంస్థలు కూడా అనుసరించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Tags:    

Similar News