సెలబ్రిటీ ఖాతాలకు బ్లూటిక్ తొలగింపు
సబ్ స్క్రిప్షన్ ఫీజు కడితేనే ఇకపై బ్లూ టిక్;
దేశంలోని సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలకు బ్లూటిక్ తొలగించింది. సెలబ్రిటీల ఖాతాలను గుర్తించేందుకు ఉపయోగపడే ఈ బ్లూటిక్‌ను.. నెలవారీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికే కేటాయిస్తోంది. సాధారణ యూజర్లు సైతం బ్లూటిక్ పొందేలా సబ్స్క్రిప్షన్ ప్లాన్లు రూపొందించింది. అలాగే డబ్బులు చెల్లించనివారికి టిక్ మార్క్‌ను తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు సెలబ్రిటీలకు బ్లూ టిక్ మార్క్ కనిపించడం లేదు.