షర్మిలపై పోలీసుల కేసు
తమపై చేయి చేసుకున్నారని కేసు నమోదు చేసిన పోలీసులు;
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమపై షర్మిల చేయి చేసుకున్నారంటూ షర్మిల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా చౌక్‌కు బయల్దేరిన షర్మిలను.. పోలీసులు ఇంటి దగ్గరే అడ్డుకున్నారు. దీంతో షర్మిల తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆమెను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పీఎస్ కు తరలించారు. ఈ క్రమంలో షర్మిల పోలీసులపై చేయి చేసుకున్నారు. షర్మిల తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై కేసు నమోదు చేశారు.