నందిగామలో ఇసుక అక్రమ మైనింగ్‌పై హైకోర్టు విచారణ
నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశం; గతంలో ఇచ్చిన నోటీసులు చేరలేదన్న పిటిషనర్;
నందిగామలో ఇసుక అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో భాగంగా నందిగామ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నోటీసులు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే గతంలో ఇచ్చిన నోటీసులు వారికి చేరలేదని పిటిషనర్ తెలిపారు. దీంతో వ్యక్తిగత నోటీసులు ఇవ్వాలని తీర్పు వెల్లడించింది. కొన్నిరోజులుగా నందిగామ లో ఇసుక అక్రమ మైనింగ్ జోరుగా కొనసాగుతుంది. సంబంధిత అధికారులకు ఫిర్యా దు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన ధర్మాసనం తాజాగా నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.