కార్పొరేటర్లపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన మేయర్ స్రవంతి
నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిని కలిసిన మేయర్ స్రవంతి; తనపై కావాలనే ముగ్గురు కార్పొరేటర్లు దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు;
నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిని మేయర్ స్రవంతి కలిశారు. తనపై కావాలనే ము గ్గురు కార్పొరేటర్లు దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. నిన్న మున్సిపల్ కౌన్సిల్ సభలో సీఎం జగన్ ఫోటో ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదంపై ఎస్పీకి మేయర్ వివరించారు. నిండు సభలో తన చీర లాగి అవమానించారని పోలీసులకు కంప్లైంట్ చేశారు. అవసరమైతే జాతీయ ఎస్టీ కమిషన్‌తోపాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని చె ప్పారు.