నూతన సచివాలయం ప్రారంభోత్సవం
సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం;
ఏప్రిల్ 30, 2023 తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం జరగనుంది. అదే రోజు నుంచి పాలన మొదలు కానుంది.. మొత్తం ఆరు ఫ్లోర్లు ఉండగా.. ఒక్కో ఫ్లోర్‌కు మూడు శాఖలు కేటాయించారు.. గ్రౌండ్ ఫ్లోర్‌లో రెవెన్యూ శాఖ యంత్రాంగం కొలువుదీరనుంది. ఫస్ట్ ఫ్లోర్‌లో హోంశాఖ, సెకండ్ ఫ్లోర్‌లో ఆర్థిక శాఖ, థర్డ్ ఫ్లోర్‌లో అగ్రికల్చర్ అండ్ ఎస్సీ డెవలప్‌మెంట్, ఫోర్త్ ఫ్లోర్‌లో ఇరిగేషన్ అండ్ లా, ఐదో అంతస్తులో సాధారణ పరిపాలన శాఖ, ఆరో ఫ్లోర్‌లో ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ చాంబర్లు ఉంటాయి.