రెజ్లర్లకు ప్రియాంకా గాంధీ మద్దతు
ఎఫ్ఐఆర్ ను పోలీసులు ఎందుకు బయటపెట్టడంలేదని మండిపాటు;
ఢిల్లీలో రెజ్లర్లు చేపట్టిన నిరసనకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సంఘీభావం పలుకుతూ దీక్షలో పాల్గొన్నారు. ఉదయం జంతర్ మంతర్ వద్ద దీక్షా శిబిరానికి వచ్చిన ప్రియాంక.. రెజ్లర్లతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్, ప్రియాంకలు తమ సమస్యలను వివరించారు. బ్రిజేష్‌భూషణ్ పై FIR నమోదు చేశామని చెపుతున్న పోలీసులు.. ఎందుకు ఇంత వరకూ ఆ కాపీని బయటకు చూపించట్లేదని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.