వీడియో తీస్తుండగానే గాల్లో కలసిన ప్రాణాలు

వీడియో కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న యూట్యూబర్

Update: 2023-05-04 07:35 GMT

ప్రముఖ యూట్యూబర్, ప్రొఫెషనల్ బైకర్ అగస్త్య చౌహాన్ బుధవారం యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. సూపర్‌బైక్‌పై గంటకు 300 కి.మీ వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తన యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియో తీస్తున్న అతను.. తొలిసారిగా తన ZX10R నింజా సూపర్‌బైక్‌లో గంటకు 300 కి.మీ వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నించాడు. బైక్ వేగంగా వెళ్ళడంతో డివైడర్‌ను ఢీకొట్టింది, తలకు తీవ్రగాయాలవ్వడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. 

Tags:    

Similar News