అప్పుడు ముద్దులు... ఇప్పుడు పిడిగుద్దులు
జగన్ వ్యవహారంపై మండిపడ్డ చంద్రబాబు;
పశ్చిమగోదావరి జిల్లా ఎస్ ముప్పవరంలో పర్యటించిన చంద్రబాబు... అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఎన్నికల సమయంలో ముద్దులు పెట్టి ఓట్లు అడిగిన జగన్.. అధికారంలోకి వచ్చాక ప్రజల్ని పిడిగుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు. మరోవైపు చంద్రబాబు పర్యటనలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. చంద్రబాబు రోడ్ షోగా వెళ్తు రైతులను పరామర్శిస్తున్న సమయంలో పోలీసులు కాసేపు హంగామా చేశారు. దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేమ్ బ్యాడ్జ్ లేకుండా డ్యూటీ ఎలా చేస్తున్నారని పోలీసులను చంద్రబాబు నిలదీశారు. రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోబోమని.. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు.