పట్టుబిగిస్తున్న జాతీయ దర్యప్తు సంస్థ
జమ్మూకాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు;
జమ్మూకాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లోజాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు నిర్వహిస్తోంది. పాకిస్థాన్ కమాండర్లు, హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు వివిధ నకిలీ పేర్లతో పనిచేస్తున్న వారిని పట్టుకోవడానికి దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శ్రీనగర్, అనంత్‌నాగ్, కుప్వారా, పూంచ్, రాజౌరి, కిష్త్వార్ జిల్లాల్లో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. రాజౌరి, పూంచ్ సెక్టార్ల చుట్టూ ఉన్న POKలోని లంజోట్, నికైల్, కోట్లి, ఖుయిరట్టాలో తీవ్రవాద కదలికలు ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.