దీదీకి లీగల్ నోటీసులు పంపిన డైరెక్టర్
ది కేరళ స్టోరీ, కాశ్మీర్ ఫైల్స్ సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసన మమతా బెనర్జీ;
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కాశ్మీర్ ఫైల్స్ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి లీగల్ నోటీసులు పంపారు. ఇటీవల మమత చేసిన ప్రకటనలలో.. 'ది కాశ్మీర్ ఫైల్స్' , 'ది కేరళ స్టోరీ' సినిమాలను సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గాన్ని కించపరిచేలా తీశారని ఆరోపించారు. ఇందుకుగాను వివేక్ ఆమెకు నోటీసులు పంపినట్లు తెలిపారు. “నేను @AbhishekOfficl, పల్లవి జోషి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతకు లీగల్ నోటీసు పంపాము, మా మర్యాదకు భంగం కలిగించే విధంగా ఆమె తప్పుడు ఆరోపణలు చేశారు. అవి మా ప్రతిష్ఠకు నష్టం కలిగించేవిగా ఉన్నాయి." అని వివేక్ ట్వీట్ చేశారు.