ఇమ్రాన్ ఖాన్ కు మద్దతు తెలిపిన మాజీ భార్య
సుప్రీం కోర్టు ఉత్తర్వులపై ట్వీట్;
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన మాజీ భార్య జెమీమా స్పందించింది. చివరకు కనువిప్పు కలిగింది అన్న భావం స్ఫురించే విధంగా "Finally sense has prevailed" అని పాకిస్థాన్ జెండా,నమస్కరిస్తున్నట్లు ఎమోజీనీ పోస్ట్ చేసింది. జెమీమా, ఇమ్రాన్ ఖాన్ 1995లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 2004 లో ఇమ్రాన్‌ఖాన్ రాజకీయ జీవితంలో ఇమడలేక అతనికి విడాకులు ఇచ్చిన జెమీమా తన కుమారులైన సులేమాన్, కాసింతో కలిసి బ్రిటన్ కు వలసపోయింది.