కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు
ఎమ్మెల్యేలను తరలించేందుకు రంగంలోకి దిగిన హెలీకాఫ్టర్ లు;
కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు మొదలైయ్యాయి. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని తరలించేందుకు 15 హెలికాప్టర్లను రంగంలోకి దింపినట్లు సమాచారం. ముందస్తుగా హోటల్స్‌ను బుక్ చేశాయి. గెలిచిన ఎమ్మెల్యేలందరిని క్యాంప్ తరలించే ఏర్పాట్లు మొదలు పెట్టాయి..బెంగళూరులోనే మకాం వేశారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సుర్జేవాలా. AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే, డీకే, సిద్ధరామయ్య, మేనిఫెస్టోకమిటీ ఛైర్మన్ పరమేశ్వర్‌తో ఆయన మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ నేతలతో రెబల్ అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు టచ్‌లోకి వెళ్లారు. రేపు సీఎల్పీ సమావేశం ఉండే అవకాశం ఉంది.