అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి కారణమైన ఆరు విషయాలు ఇప్పుడు వైరల్ గా మారింది. గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళల కోసం గృహలక్ష్మి పథకం బాగా కలసి వచ్చింది. ఈ పథకం ద్వారా మహిళా పెద్దకు ప్రతి నెల రూ. 2 వేలు అందజేయనున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి అన్న భాగ్య పథకం ద్వారా 10 కేజీల బియ్యం, నిరుద్యోగ పట్టభద్రులకు ప్రతి నెల 3వేల భృతి బాగా వర్కౌట్ అయింది. మహిళలకు ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం కూడా కాంగ్రెస్ విజయానికి కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.