కరెంట్ కోత... కాన్పుల నిలిపివేత
బాపట్ల జిల్లా ఆసుపత్రిలో గర్భిణుల ఆక్రందనలు;
బాపట్ల ఏరియా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోగులు. కరెంటు లేకపోవడంతో కాన్పులు ఆగిపోయాయి. జనరేటర్ ఉన్నా పనిచేయకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. కనీసం ఫ్యాన్ కూడా తిరగని పరిస్థితి. ఇన్ని సమస్యలు ఉన్నా ఇవేవీ పట్టించుకోవడం లేదు వైద్యాధికారులు. ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామనే ముసుగులో వైసీపీ రంగులపై శ్రద్ధ పెడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.