చీకోటిపై ఈడీ ప్రశ్నల వర్షం
ఇద్దరు న్యాయవాదులతో సహా ఈడీ ముందు హాజరైన చీకోటి ప్రవీణ్;
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ మరోసారి ఈడీ ముందుకు వచ్చారు. థాయ్‌లాండ్ గ్యాంబ్లింగ్ కేసుపై లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్..కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి.. చికోటిపై ప్రశ్నలు సంధిస్తోంది. మనీలాండరింగ్, విదేశీ ప్రయాణాలపై ప్రశ్నిస్తోంది. ఇద్దరు న్యాయవాదులతో కలిసి చికోటి ప్రవీణ్ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఇటీవల థాయ్‌లాండ్ క్యాసినో ఘటనలో చికోటి ప్రవీణ్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై బయటికొచ్చారు. ఈ ఘటనలో ఇప్పటికే చికోటితో పాటు చిట్టి దేవేందర్ రెడ్డి, మాధవరెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది.