జగన్ సర్కారును ఆదుకున్న కేంద్రం
జగన్ ప్రభుత్వానికి.. రూ. పదిన్నర వేల కోట్లు మంజూరు;
అప్పుల ఊబిలో పీకల్లోతు కూరుకుపోయిన ఏపీ సర్కారుపై మరోసారి కరుణ చూపించింది మోదీ సర్కారు. ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న జగన్ ప్రభుత్వానికి.. ఏకంగా పదిన్నర వేల కోట్లు ఇచ్చింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటి రెవెన్యూలోటు కింద ఈ ఆర్ధిక సాయం చేసింది.