Pune: పుణెలో అమ్మోనియా గ్యాస్ లీక్.. 17 మందికి అస్వస్థత
ఆహారశుద్ధి పరిశ్రమలో ఘటన;
పుణెలోని భాండ్‌గామ్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో ఆహార తయారీ ప్లాంట్‌లో అమ్మోనియా గ్యాస్ లీకై 17 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. భాండ్‌గామ్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఓ రెడీ-టు-ఈట్ యూనిట్‌లో బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ యూనిట్‌ను నిత్యం 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచాల్సి ఉంటుంది. అందుకోసం అమ్మోనియా గ్యాస్‌ను ఉపయోగిస్తారు. అది ప్రమాదవశాత్తూ లీక్ కావడం తాజా ఘటనకు దారితీసిదన్నారు. దీంతో 17 మంది శ్వాసతీసుకోవటంలో ఇబ్బంది వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించి వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
మహారాష్ట్ర పుణె జిల్లాలో యవత్ ప్రాంతంలోని ఓ ఆహార శుద్ధి పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీకైంది . ఈ ఘటనలో 17 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. భాండ్‌గామ్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఓ రెడీ-టు-ఈట్ యూనిట్‌లో బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ యూనిట్‌ను నిత్యం 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచాల్సి ఉంటుంది. అందుకోసం అమ్మోనియా గ్యాస్‌ను ఉపయోగిస్తారు. అది ప్రమాదవశాత్తూ లీక్‌కావడం తాజా ఘటనకు దారితీసింది. ప్రమాద సమయంలో యూనిట్‌లో 25 మంది పనిచేస్తున్నారని సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ నారాయణ్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. వీరిలో చాలా మంది మహిళలేనని తెలిపారు.
గ్యాస్ లీకవుతున్నట్లు గుర్తించిన వెంటనే మెయిన్ రెగ్యులేటర్‌ను ఆఫ్ చేసినట్లు నారాయణ్ తెలిపారు. శ్వాసతీసుకోవటంలో ఇబ్బంది వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించిన సిబ్బందిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. 16 మంది ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. గ్యాస్ లీక్ పాయింట్‌కు దగ్గరగా ఉన్న ఓ మహిళకు మాత్రం ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఆమె ప్రాణాలకు ముప్పు లేదని వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిపారు.