Kenya: గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీలో పేలుడు, ఇద్దరు సజీవదహనం
165 మంది తీవ్ర గాయాలు;
కెన్యా రాజధాని నైరోబీలో గురువారం భారీ పేలుడు సంభవించింది. స్థానికంగా ఉన్న గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరో 165 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. కంపెనీలో ఉన్న భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.